భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలో నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్ చేస్తూ మహిళలు బుధవారం పోస్టాఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వారం, పది రోజులుగా నీళ్లు రాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ట్యాంకర్లు అరకొరగా వస్తుండడంతో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సింగరేణి వాటర్ రాని ప్రాంతాల్లో ప్రజలు నీళ్లను కొనుక్కునే పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసనలో కౌన్సిలర్లు, నాయకులు బోయిన విజయ్ కుమార్, సమైఖ్య, భవానీ, విజయ, పాల్గొన్నారు.