ఖాళీ బిందెలతో మహిళల నిరసన

జమ్మికుంట, వెలుగు:  ఐదు రోజులుగా నల్లా నీరు రావడం లేదని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లంతకుంట క్రాస్​రోడ్‌ వద్ద గురువారం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వార్డులలో తాగునీరు రాక అవస్థలు పడుతున్నా ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. 

పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలకు సర్ధిచెప్పారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సజ్జాద్ మొహమ్మద్,  సతీశ్‌ రెడ్డి , రంజిత్‌రెడ్డి, లలిత , రమా, రాజేశ్వరి , రబ్బాన , సుందరమ్మ , శ్రీమతి , సరూప, షబానా, కళ్యాణి , రాణి, తార  తదితరులు పాల్గొన్నారు