
కొమురవెల్లి, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి గ్రామంలో 5, 6 వార్డుల్లో కొన్ని రోజులుగా నీళ్లు రావడం లేదు. దీంతో కాలనీలోని మహిళలు గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. .