
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, స్టార్టప్‌లు ఇలా వివిధ సెగ్మెంట్లలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. కిందటేడాది నవంబర్ 30 నాటికి రిజిస్టర్ అయిన మొత్తం బ్యాంకు ఖాతాలలో మహిళల వాటా 39.2 శాతంగా రికార్డయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 42.2 శాతంగా ఉంది. ఇండియాలో విద్య, వైద్యం, ఆర్థిక కార్యకలాపాలు, నిర్ణయాధికారం, జనాభా వంటి కీలక సెగ్మెంట్లలో మగవారితో పోలిస్తే మహిళలు ఎలా ఉన్నారో తెలియజేసే రిపోర్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలోని మొత్తం బ్యాంకు ఖాతాలలో మహిళల వాటా 39.2 శాతంగా ఉండగా, మొత్తం డిపాజిట్లలో 39.7 శాతం వీరిదే ఉంది.
మార్చి 31, 2021 నుంచి నవంబర్ 30, 2024 వరకు, మొత్తం డీమాట్ ఖాతాల సంఖ్య 3.33 కోట్ల నుంచి సుమారు 14.30 కోట్లకు పెరిగింది. నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఈ ఖాతాలలో మగవారి వాటా ఎక్కువగా ఉన్నా, మహిళల ఖాతాలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. పురుషుల డీమాట్ ఖాతాల సంఖ్య 2021లో 2.66 కోట్లు ఉంటే 2024 నాటికి 11.53 కోట్లకు చేరుకుంది. ఇదే టైమ్‌లో మహిళల ఖాతాల సంఖ్య 66.7 లక్షల నుంచి 2.77 కోట్లకు పెరిగింది.
మాన్యుఫాక్చరింగ్, ట్రేడ్, సర్వీసెస్ సెక్టార్లలో మహిళలు ఓనర్లుగా ఉన్న కంపెనీలు పెరుగుతున్నాయి. కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్న స్టార్టప్‌లు గత కొన్నేళ్లలో పెద్ద మొత్తంలో పెరిగాయి. డీపీఐఐటీ డేటా ప్రకారం, 2017లో ఇటువంటి స్టార్టప్‌లు 1,943 ఉండగా, 2024లో 17,405కి ఎగిసింది మొత్తం ఓటర్ల సంఖ్య 1952లో 17.32 కోట్లు ఉండగా, 2024లో 97.8 కోట్లకు పెరిగింది. ఇందులో మహిళా ఓటర్ల వాటా గణనీయంగా వృద్ధి చెందింది. మగవారి కంటే ఎక్కువగా ఉంది.