బంగ్లాదేశ్‌‌కు విండీస్‌‌ చెక్‌‌

బంగ్లాదేశ్‌‌కు విండీస్‌‌ చెక్‌‌

షార్జా : ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగిన వెస్టిండీస్‌‌.. విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో కీలక విజయాన్ని సాధించింది. చిన్న టార్గెట్‌‌ను వేగంగా ఛేదించిన విండీస్‌‌ గురువారం జరిగిన గ్రూప్‌‌–బి మూడో మ్యాచ్‌‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌కు చెక్‌‌ పెట్టింది. దీంతో నెట్‌‌ రన్‌‌రేట్‌‌ను భారీగా మెరుగుపర్చుకుని టాప్‌‌ ప్లేస్‌‌ను సొంతం చేసుకుంది. ఇక ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో రెండింటిలో ఓడిన బంగ్లా దాదాపుగా సెమీస్‌‌కు దూరమైనట్లే. టాస్‌‌ ఓడిన బంగ్లాదేశ్‌‌ 20 ఓవర్లలో 103/8 స్కోరు చేసింది. కెప్టెన్‌‌ నిగర్‌‌ సుల్తానా (44 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 39) టాప్‌‌ స్కోరర్‌‌. 

విండీస్‌‌ బౌలర్‌‌ కరిష్మా (4/17), ఫ్లెచర్‌‌ (2/25) దెబ్బకు బంగ్లా ఇన్నింగ్స్‌‌ బొక్క బోర్లా పడింది. దిలారా అక్తర్‌‌ (19), శోభన మోస్ట్రే (16), రితూ మోనీ (10) మోస్తరుగా ఆడారు. ఆరుగురు సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోర్లే చేయడంతో బంగ్లా మంచి టార్గెట్‌‌ను నిర్దేశించలేదు. హీలీ మాథ్యూస్‌‌ ఒక్క వికెట్‌‌ తీసింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన వెస్టిండీస్‌‌ 12.5 ఓవర్లలోనే 104/3 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు హీలీ మాథ్యూస్‌‌ (22 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 34)

స్టెఫానీ టేలర్‌‌ (27) తొలి వికెట్‌‌కు 52 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. మిడిల్‌‌లో క్యాంప్‌‌బెల్‌‌ (16 బాల్స్‌‌లో 2 ఫోర్లతో 21) నిలకడగా ఆడింది. చివర్లో దియోంద్ర డాటిన్‌‌ (7 బాల్స్‌‌లో 1 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 19 నాటౌట్‌‌), చినెల్లి హెన్రీ (2 నాటౌట్‌‌) చెలరేగడంతో కరీబియన్లు ఈజీగా విజయాన్ని అందుకున్నారు. నహీదా అక్తర్‌‌, మరుఫా అక్తర్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. కరిష్మాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.