వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లు!

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లు!

హైదరాబాద్,వెలుగు: త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్ట నున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ పూర్తి చేసింది. గత సమా వేశాల్లోనే బిల్లు పెట్టాలని భావించినా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. ప్రస్తుతం మహిళా వర్సిటీ విద్యార్థులు ఆందోళనల నేపథ్యంలో బిల్లును అసెంబ్లీలో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.

దీంతో పాటు ఆర్జీయూ కేటీ చట్ట సవరణ బిల్లు కూడా పెట్టనున్నట్టు సమాచా రం. వర్సిటీ చాన్సలర్​గా విద్యావేత్త స్థానంలో గవర్నర్ పేరును పెట్టనున్నట్టు సమాచారం. ఈ రెండు వర్సిటీలకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం లీగల్ ఓపీనియన్ కూడా తీసుకుంది.