అభివృద్ధిని ఎంపీ చూడలేకపోతున్నరు: వసంత

జగిత్యాల టౌన్,వెలుగు: జగిత్యాల ప్రాంత అభివృద్ధిని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​కండ్లు ఉండి చూడలేకపోతున్నారని జడ్పీ చైర్​పర్సన్   దావ వసంత ఆరోపించారు. బీజేపీ ధర్నాలో ఎంపీ మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు. నాటి ఎంపీ కవిత సహకారంతో సీఎం కేసీఆర్ జగిత్యాలలో 4,250 డబుల్​బెడ్రూం ఇండ్లు మంజూరు  చేశారన్నారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే సంజయ్  కృషి చేస్తున్నారన్నారు. నిజామాబాద్ ఎంపీ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ అర్వింద్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్​చేశారు. 

ALSO READ :ముస్లింలకు మంత్రి హరీశ్ క్షమాపణలు చెప్పాలి: మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా

పసుపు బోర్డు తీసుకువస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని మండిపడ్డారు. బోర్డు తీసుకురాని ఆయన రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలన్నారు. కవితపై  నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.  నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ.వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత కవితది అని ఆమె అన్నారు.