![Valentine's Day special: హైదరాబాద్ వండర్ లా లో కపుల్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్స్..](https://static.v6velugu.com/uploads/2025/02/wonderla-hyderabad-announces-valentines-special-discounts-events_rxDLTVE8Q5.jpg)
వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది.. ప్రేమికుల రోజును చిరకాలం గుర్తుండిపోయేలా జరుపుకునేందుకు ప్రేమ జంటలు ప్లాన్ చేసుకుంటున్నాయి.హోటళ్లు, రెస్టారెంట్లు, గిఫ్ట్ షాపులు, కాఫీ షాపులు.. ఇలా అన్ని చోట్ల వాలెంటైన్స్ వీక్ మొదలైనప్పటి నుండి లవర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు రోజుకో కొత్త ఆఫర్స్ దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాస్ లార్జెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ వండర్ లా కూడా లవర్స్ కోసం అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది.. ఫిబ్రవరి 7 నుండి 16 వరకు, ఈ పార్క్ జంటలకు ప్రత్యేకమైన ఆఫర్లతో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వాశిస్తోంది.
ఫిబ్రవరి 7 నుండి 14 వరకు వాలెంటైన్స్ డే స్పెషల్ అట్రాక్షన్ కింద స్కై వీల్ డైన్‌ను లాంచ్ చేస్తోంది, దీని ద్వారా కపుల్స్ సిటీ అందాలను వీక్షించటంతో పాటు చిరకాలం గుర్తుండిపోయే డైనింగ్ అనుభవాన్ని పొందొచ్చు. ఫిబ్రవరి 14న, వేవ్ పూల్ డిన్నర్ లో భాగంగా మ్యూజిక్, ఎమ్సీ ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తోంది.
వాలెంటైన్స్ డే తర్వాత సింగిల్స్ కోసం కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసింది వండర్ లా... ఫిబ్రవరి 15న DJ ఈవినింగ్ పేరుతో కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది వండర్ లా.
అంతే కాకుండా వండర్లా టిక్కెట్లపై కపుల్స్ పాస్‌లపై 35 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తోంది. అదనంగా, ఫిబ్రవరి 7 నుండి 14 వరకు ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేకమైన ఫుడ్, టికెట్ కంబోస్ కూడా ప్రకటించింది. వండర్ లా అఫీషియల్ వెబ్సైట్ లో టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ.. వండర్ లా టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.