
పహాల్గమ్ ఉగ్రదాడితో దేశమంతా ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. 26 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ తీయాలని భారత పౌరులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశంపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర హోదా అడగాలని...26 మంది అమాయకుల శవాలను అడ్డుగా పెట్టి రాష్ట్ర హోదా అడగలేనని అన్నారు ఒమర్ అబ్దుల్లా. రాష్ట్ర హోదాపై అసెంబ్లీలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఒమర్ అబ్దుల్లా.
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ముఖ్యమైన అంశమే అయినప్పటికీ.. అమాయకుల మరణాలను రాజకీయాలకు వాడుకోవడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర హోదా డిమాండ్ ను వేరొక సమయంలో లేవనెత్తుదామని అన్నారు ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ లో లా అండ్ ఆర్డర్ కు తాము బాద్యులం కాకపోయినా.. ఈ పరిస్థితిలో రాష్ట్ర హోదా డిమాండ్ చేయబోమని స్పష్టం చేశారు. శవాలను అడ్డుపెట్టుకొని రాష్ట్ర హోదా డిమాండ్ చేయనని.. ఇంకో సందర్భంలో డిమాండ్ చేస్తానని అన్నారు ఒమర్ అబ్దుల్లా.
26 మంది అమాయకుల మరణాన్ని వాడుకొని రాష్ట్ర హోదా అడిగేంత దిగజారుడు రాజకీయం తాను చేయనని.. రాజకీయాలకు ఓ లిమిట్ ఉండాలని.. అందులోను మనుషుల ప్రాణాలతో ముడిపడ్డ అంశాల్లో కచ్చితంగా లిమిట్స్ ఉండాలని అన్నారు ఒమర్ అబ్దుల్లా.