ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ లో ఘటన : విద్యార్థిని ఆత్మహత్య యత్నం 

వరంగల్‌ : ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఓ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసింది. పరీక్షలో కాపీయింగ్ చేసిందని ఇన్విజిలేటర్ తిట్టడంతో..మనస్తాపానికి గురైన విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ నుంచి దూకింది. ఈ సంఘటన ఇవాళ హన్మకొండ RP కాలేజీలో జరిగింది.

కాలేజీ భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో.. విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి.  ఆమెను కాలేజీ సిబ్బంది వెంటనే MGM హస్పిటల్ కి తరలించారు. రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.  హన్మకొండ ACP ఎగ్జామ్ సెంటర్ కి చేరుకొని జరిగిన సంఘటనపై పరీక్ష నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పరీక్ష కేంద్రానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు.