లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : కేటీఆర్

లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : కేటీఆర్

కామారెడ్డి, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు. జహీరాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని బీఆర్ఎస్ ​లీడర్లతో ఆదివారం హైదారాబాద్​లోని  తెలంగాణ భవన్​లో మీటింగ్​ నిర్వహించారు. సమావేశానికి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, లీడర్లు హాజరయ్యారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పార్లమెంట్​ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను లీడర్లకు దిశానిర్దేశం చేశారు. చిన్నచిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడామని, పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

బాన్సువాడ, బాల్కొండ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్​రెడ్డి, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్​షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్​పర్సన్​ దఫేదర్ ​శోభ, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబోద్దీన్, మున్సిపల్ ​చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు.