ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు మరికొన్ని రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పిస్తున్నాయి. లేటెస్టుగా ఈ లిస్టులో విప్రో కూడా చేరింది. భారత్, అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులంతా జనవరి 18, 2021 వరకు ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాలకు చెందిన వారున్నారు. భారత్‌లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఇంకా భారీ స్థాయిలోనే నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ అవుతున్నాయి.దీంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది.
ఇక మిగతా దేశాలకు సంబంధించి అక్కడి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది విప్రో. ఉద్యోగుల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బి.భానుమూర్తి తెలిపారు. పనితీరు పూర్తిగా మారిందని, అంతేకాదు భవిష్యత్తులో ఉద్యోగులంతా ఆఫీసుకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు ప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ.
కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుండటంతో వర్క్ ఫ్రమ్ హోం విధానం మంచి ఫలితాలు కూడా ఇస్తుండటంతో పలు సాప్ట్ వేర్ కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని శాశ్వతం చేశాయి.