- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి, వెలుగు : నల్గొండ, ఖమ్మం,- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలగిరి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు అందరూ అండగా ఉండాలని కోరారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అలాగైతే పనిచేశారో తీన్మార్ మల్లన్న విజయం కోసం అదే విధంగా కృషి చేయాలన్నారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, నరేశ్, పాలకుర్తి రాజయ్య, పేరాల వీరేశ్, జుమ్మిలాల్, సుంకర జనార్దన్, అంబేద్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.