రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థల .. ఏర్పాటుకు కృషి చేయండి

రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థల .. ఏర్పాటుకు కృషి చేయండి
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఐఎస్​యూ నాయకుల వినతి 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్(ఐఎస్ యూ) నాయకులు కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి కరీంనగర్ లో ఆదివారం వినతిపత్రం సమర్పించారు. మన రాష్ట్రానికి ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అదనంగా తీసుకు రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఐఐఎం, మైనింగ్ యూనివర్సిటీలు లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

 వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐఎస్ యూ జాతీయ అధ్యక్షుడు పాపని నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్​ గౌడ్ కోరారు. ఒక వేళ అవి ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం ఉంటే, క్యాంపస్ లనైనా ఏర్పాటు చేయాలన్నారు.  దీంతో వీటిల్లో 50 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు లభిస్తాయని పేర్కొన్నారు.  అలాగే రాష్ట్రంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లను ఖాళీగా ఉంచకుండా  భర్తీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.