ఖైరతాబాద్ బడా గణేష్ కర్ర పూజ: ఈసారి 70 అడుగుల గణపతి

ఖైరతాబాద్ బడా గణేష్ కర్ర పూజ: ఈసారి 70 అడుగుల గణపతి

హైదరాబాద్: ప్రతిఏటా ఖైరతాబాద్ లో జరిగే గణపతి ఉత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి జరపబోయే గణేష్ విగ్రహ ప్రతిష్ఠకు జూన్ 17 (సోమవారం) నుంచి మహా గణపతి పనులు కర్రపూజ చేసి ప్రారంభించారు.  ప్రతి సంవత్సరం నిర్మల ఏకాదశి రోజున ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటి కర్ర పూజ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యలు పాల్గొన్నారు. మహా గణపతి విగ్రహ ఎత్తు 70 అడుగులుగా నిర్ణయించారు.

11రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం అన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ భద్రత పెంపు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, అన్నీ శాఖల సమన్వయంతో ఉత్సవాలు చేస్తామని ఆయన అన్నారు. విగ్రహ పనులు ప్రారంభించడానికి ఈరోజు కర్రపూజ కార్యక్రమం నిర్వహించారు.