నెల్లికుదురు (ఇనుగుర్తి), వెలుగు: ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు ప్రారంభించిన ‘తెనుగు’ పత్రిక శతాబ్ది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం పత్రిక శత సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించగా.. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సంగీత సాహిత్యంతో పాటు వైద్య ముద్రణ, వడ్రంగి తాపీ తదితర పలు రంగాల్లో నిష్ణాతులైన ఒద్దిరాజులకు తగిన గుర్తింపు రాలేదని, శిథిలావస్థలోని భవనాన్ని పరిరక్షించుకునే బాధ్యత ఉందని సూచించారు.
ట్యాంక్ బండ్పై ఒద్దిరాజుల సోదరులు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చే సంస్థను త్వరలో ఏర్పాటు చేసి, సిలబస్లో ఒద్దిరాజుల చరిత్ర పెడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒద్దిరాజు సుభాశ్, గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్, ట్రస్ట్ ప్రతినిధులు ఒద్దిరాజు చంద్రప్రకాష్, వినయ్ బాబు, అనిల్ సతీశ్, పెద్ద వెంకన్న, సీనియర్ జర్నలిస్టులు బండి సంపత్, రాజమల్లు యాదవ్, పరకాల రవీందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.