ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి కృషి

ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి కృషి

 బూర్గంపహాడ్, వెలుగు : ప్రతి ఏటా గోదావరి వరదతో ఇబ్బందులు పడుతున్న ముంపువాసులకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బూర్గంపహాడ్ లో ఇటీవల  గోదావరి వరదలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి ముంపునకు గురయ్యే కాలనీ వాసులు స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి సురక్షిత  ప్రాంతాలకు తరలిపోవడానికి అంగీకరిస్తే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

 అందుకు ముంపువాసుల వివరాలు సేకరించాలని తహసీల్దార్ ముజాహుద్దీన్ ను ఆయన ఆదేశించారు.   అంతకుముందు బూర్గంపహాడ్ రైతువేదికలో73మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజాహుద్దీన్, ఎంపీవో సునీల్, ఐకేపీ ఏపీఎం నాగార్జున, మాజీ ఎంపీపీ కైపు రోసిరెడ్ది, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్ది వెంకటేశ్వర రెడ్ది, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్ది వెంకటేశ్వర రెడ్ది, ఐఎన్టీయూసీ నాయకుడు మారం వెంకటేశ్వర రెడ్ది, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

మణుగూరు :  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మండలానికి చెందిన 120 మంది లబ్ధిదారులు చెక్కులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రాఘవ రెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు.