- బంగారం, రూ. 5.97 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
జూబ్లీహిల్స్, వెలుగు: పని చేసిన ఇంటికే కన్నం వేసిన దొంగలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ద్రాక్షారామం గ్రామానికి చెందిన రేవు సురేశ్ (30), తాడేపల్లిగూడెంకు చెందిన అవిటి పుల్లారావు (52) అదే ప్రాంతానికి చెందిన నీలపర్తిపాడు గ్రామానికి చెందిన తూటి సుబ్బారావు (38) ముగ్గరు వివిధ ప్రాంతాల్లో వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. జులై 18న సురేశ్, మిగతా ఇద్దరు తాము పనిచేసిన రోడ్డు నంబర్ 54 ప్లాట్ నంబర్ 1167లో ఎవరూ లేని సమయంలో దొంగతనం చేశారు. ఆ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు.
సుమారు రూ.10 లక్షలు విలువ చేసే వివిధ నగలను దోచుకెళ్లారు. వాటిని వెంకటగిరిలో ఉన్న నగల వ్యాపారి యోగేశ్ శాంతిలాల్ జైన్ (37) అనే వ్యక్తికి అమ్మారు. బాధితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 5.97 లక్షల నగదు,12 గ్రాముల గోల్డ్రింగ్, గోల్డ్చైన్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి టీం ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.