
జీడిమెట్ల, వెలుగు: బిల్డింగ్‌పైనుంచి కింద పడి ఓ కార్మికుడు చనిపోయిన ఘటన పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లికి చెందిన శ్రీను(41) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మేస్త్రీ గోవిందరెడ్డితో కలిసి కొంపల్లిలో సెంట్రల్ పార్కు స్ట్రీట్‌లో ఓ పాత బిల్డింగ్‌కు రిపేర్లు చేశాడు. రాత్రి ఇద్దరూ భోజనం చేసి అదే బిల్డింగ్‌పై పడుకున్నారు. అర్ధరాత్రి శ్రీను వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు లేచాడు. నిద్రమత్తులో బిల్డింగ్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.