17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతి

17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతి

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్17వ అంతస్తు నుంచి కిందపడి ఒకరు మృతి చెందాడు. కొండాపూర్ అంజయ్యనగర్​కు చెందిన ఆలం రాకేశ్​(23) మాదాపూర్ లోని వాసవి స్కైలా కన్​స్ట్రక్షన్ సైట్ లో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో బిల్డింగ్ 17వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. క్షతగాత్రుడిని తోటి కూలీలు, కన్​స్ట్రక్షన్​ ప్రతినిధులు కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సైట్ కాంట్రాక్టర్ సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.