స్లాబ్‌‌ సెంట్రింగ్‌‌ కూలి ఏడుగురికి గాయాలు

గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీరులో లీగ్‌‌ లీడింగ్‌‌ ది చేంజ్‌‌ అనే నిర్మాణ సంస్థ చేపడుతున్న భారీ బిల్డింగ్​ స్లాబ్​ సెంట్రింగ్ ​కూలి గురువారం ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఒక్కసారిగా సెంట్రింగ్​ కూలడంతో కార్మికులు దాని కింద ఇరుక్కుపోయారు. అతికష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. జాగ్రత్తలు చేపట్టకుండా పనులు ఎలా చేస్తారని స్థానికులు మండిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.