శ్రీరాంపూర్ లో సూపర్​వైజర్ వేధిస్తున్నాడని కార్మికుల ఆవేదన

శ్రీరాంపూర్ లో సూపర్​వైజర్ వేధిస్తున్నాడని కార్మికుల ఆవేదన

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియలో సివిల్ వర్క్ డిపార్ట్​మెంట్ సూపర్​వైజర్ వేధిస్తున్నాడని కార్మికులు ఆరోపించారు. ఓ కార్మికుడి కుటుంబసభ్యలు, తోటి కార్మికులు గురువారం నస్పూర్​లోని ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోపు శివకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు అనారోగ్యంతో నెల రోజులపాటు విధులకు వెళ్లలేదని, ఆరోగ్యం మెరుగైన వెంటనే వెళ్తే సూపర్​వైజర్ గంగారం విధుల్లోకి తీసుకోకుండా కాంట్రాక్టర్​తో చెప్పించాలని, ఆ తర్వాత కాంట్రాక్టర్ చెప్పినా వినలేదన్నారు. సింగరేణి డీజీఎం(సివిల్) చెప్పినా తీసుకోలేదని వాపోయారు. గత 15 రోజుల నుంచి తిప్పించుకుంటున్నాడని శివకాంత్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కూడా వెళ్లగా శివరాంపై మండిపడడంతో ఆవేదనకు గురై.. చనిపోతానని వెళ్లిపోయాడని తెలిపారు. 

తన కొడుకుకు ఏమి జరిగిన సూపర్​వైజర్ గంగారామే కారణమన్నారు. గంగారాంకు ట్రాన్స్​ఫర్ ఆర్డర్స్ ​వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ కార్మికులను వేధిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం వెళ్లిపోయిన శివకాంత్ కోసం కాంట్రాక్ట్ కార్మికులు వెతకగా సాయంత్రం గోదావరిఖనిలో ఉన్నట్లు ఆచూకీ దొరికిందని తెలిపారు. శివకాంత్ తల్లి సమ్మక్క, కాంట్రాక్ట్ కార్మికులు ప్రభాకర్, సురేంద్రచారి, అనిల్ కుమార్, సమ్మయ్య, సంతోష్, అశోక్, శ్రీనివాస్, వెంకటేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.