ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల రక్తదానం

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల రక్తదానం

ఖమ్మంటౌన్/భద్రాచలం/సత్తుపల్లి, వెలుగు : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల్లో కార్మికులు రక్తదానం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పిలుపు మేరకు ఖమ్మం నగరంలోని ఆర్టీసీ న్యూ బస్టాండ్ లో రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్, సత్తుపల్లిలో డీఎం రాజ్యలక్ష్మి, భద్రాచలం డీఎం తిరుపతిరావు సమక్షంలో శిబిరాలు నిర్వహించారు. పలువురు రక్తదానం చేశారు. రెడ్​క్రాస్​ సొసైటీ, లయన్స్ క్లబ్​ సభ్యులు పాల్గొన్నారు. 

మాజీ ఎమ్మెల్యే కందాళ బర్త్​డే సందర్భంగా... 

కూసుమంచి : తలసేమియా బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి బర్త్​డే సందర్భంగా బుధవారం ఖమ్మం రూరల్​ మండలం సాయిగణేశ్​నగర్​ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  శిబిరాన్ని ప్రారంభించారు.  మాజీ డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్​తో పాటు పలువురు బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది రక్తదానం చేశారు.