- ‘చలో సింగరేణి హెడ్డాఫీస్’ను సక్సెస్ చేయాలె
- రిటైర్డ్ కార్మికుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య పిలుపు
కోల్‌బెల్ట్, వెలుగు : రిటైర్డ్కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్వద్ద తలపెట్టిన ధర్నాను సక్సెస్ చేయాలని రిటైర్డ్కార్మికుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలోని రాముని చెరువు కట్ట పోచమ్మ ఆలయ ఆవరణలో రిటైర్డ్కార్మికులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఏండ్లుగా కార్మికుల పెన్షన్పెంచడం లేదన్నారు. మూడేండ్లకోసారి రివైజ్చేసి పెన్షన్‌ను పెంచాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు
యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. 1998లో పెన్షన్‌స్కీం అమలులోకి రాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రివైజ్ చేయలేదన్నారు. అధికారులతో సమానంగా ఫండ్‌ను రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటళ్లలో రిటైర్డు కార్మికుల నుంచి ఎలాంటి వైద్య ఖర్చులు రికవరీ చేయొద్దన్నారు. రూ.20లక్షల గ్రాట్యుటీని జులై 1,2016 నుంచి అమలు చేయాలని, రిటైర్డ్కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ
‘చలో సింగరేణి హెడ్డాఫీస్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్ట్కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, మాజీ సింగరేణి సీజీఎం చంద్రునాయక్, నాయకులు కృష్ణ, శశాంక్రావు, విజ్ఞేశ్ , ఒడ్నాల శ్యాంసుందర్, పి.రాంరెడ్డి, రాజేశం, చిప్ప రామస్వామి, చుంచు శంకరయ్య పాల్గొన్నారు.