పీఎఫ్ పైసలెక్కడా? అడ్రస్ లేని రూ.50 లక్షలు

  • అడ్రస్ లేని రూ.50 లక్షలు
  • కార్మికుల పీఎఫ్​ ఖాతా లేనప్పటికీ కటింగ్స్‌
  • తిరిగివ్వాలని కార్మికులకే నోటీసులిచ్చిన కమిషనర్

నర్సంపేట, వెలుగు : పీఎఫ్‌‌‌‌ ఖాతాలే లేని కార్మికులకు ప్రతినెలా పైసలు కటింగ్‌‌‌‌ అయితున్నయ్‌‌‌‌. నర్సంపేట మున్సిపాలిటీలో వింత దోరణి జరుగుతోంది. కార్మికుల సంక్షేమంపై ఆఫీసర్లు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్ కార్మికులు 14 మంది ఉండగా వీరికి ప్రతి నెలా  సీనియారిటీని బట్టి వాళ్ల జీతం నుంచి రూ.2,350 నుంచి1,576 వరకు కటింగ్స్‌‌‌‌​అవుతుంటాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహాలో ఒక్కో కార్మికుడికి అంతే మొత్తాన్ని కలిపి పీఎఫ్​ ఖాతాలో వేస్తోంది. కాగా ఈ 14 మంది కార్మికుల పీఎఫ్‌‌‌‌ మొత్తం 2011 నుంచి నేటి వరకు సుమారు రూ.52 లక్షలు అవుతుంది. ఇది ప్రభుత్వ పీఎఫ్ ఖాతాలో ఉండాలి. కానీ ఆ14 మంది ఎన్​ఎంఆర్​ కార్మికులకు ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతాలే లేవు. అయినప్పటికీ ప్రతి నెలా పీఎఫ్​పేరుతో కటింగ్​అవుతునే ఉన్నాయి. దీంతో కటింగ్ పైసలు అడ్రస్ దొరకకా కార్మికులు లబోదిబో అంటున్నారు. పైగా ఒక్కో కార్మికుడు రూ.50 వేల నుంచి లక్షపైగా డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీసులను కమిషనర్  పంపడంతో కార్మికులు తమ రాష్ట్ర స్థాయి సంఘాలను ఆశ్రయించగా  రెండో నోటీసుల పంపిణీని విరమించుకున్నారు.

పైసలు ఏమైనట్లు?

కాగా14 మంది ఎన్ఎంఆర్ కార్మికుల పీఎఫ్​డబ్బులు 9 ఏళ్ల నుంచి ఏమైనట్లని సీనియర్ అసిస్టెంట్‌‌‌‌ సంపత్ కుమార్​ను వివరణ అడగగా రూ.33 లక్షలు జిల్లా ప్రాఫిడెంట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో ఉన్నాయని, ఈ ఏడాది జనవరి నుంచి  మున్సిపాలిటీ  ట్రెజరీ ఖాతాలో ఉన్నాయని సమాధానం ఇచ్చారు. కాగా ఇంకా రూ.15 లక్షలకు పైగా ఏమైనట్లని కార్మికులు, పలు సంఘాల నాయకులు, పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఆఫీసర్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి

నర్సంపేట మున్సిపాలిటీలో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై సత్వరమే జిల్లా ఆఫీసర్లు స్పందించాలి. ఎన్ఎంఆర్​ కార్మికులకు ఆపద వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇందులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టాయి. వెంటనే కార్మికుల ఖాతాల్లోకి నిధులను మల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేపడతాం.

– కందకట్ల వీరేశ్‌‌‌‌, సీఐటీయూ గౌరవ సలహాదారు