సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ధర్నా

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ధర్నా

పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని సింగరేణి జిఎం. కార్యాలయం ఎదుట ఐ ఎన్ టి యు సి  ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐ ఎన్ టి యు సి నాయకులు, కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, అర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం తదితరులు పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక  చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కు బొగ్గు బ్లాకుల ఇవ్వాలని డిమాండ్ చేశారు. MMDR-2015 చట్టానికి 13 మంది బీఆర్ఎస్  ఎం.పీ లు మద్దతు తెలిపి ప్రయివేటీకరణను ప్రోత్సహించారని ధర్మపురి అన్నారు.