
బోధన్, వెలుగు : బకాయి వేతనాలు చెల్లించాలని బోధన్‌లోని షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట బుధవారం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ లేఆఫ్ కావడంతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కార్మికులకు రావాల్సిన పదేండ్ల బకాయి వేతనాలు ఇవ్వాలని కోరారు. వేతనాలు అందక బెంగతో గుండెపోటు, అనారోగ్యాలతో కార్మికులు మృతి చెందారని తెలిపారు.
ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తామని చెప్పిన ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి 15 నెలలు గడిచినా పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, ఈరవేని సత్యనారాయణ, శ్రీనివాస్, రాంబాబు, భాస్కర్ పాల్గొన్నారు.