గోదావరిఖని, వెలుగు: ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా సింగరేణిలో 32 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బొగ్గు గనులపై సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో జీడీకే 2ఏ గనిపై జరిగిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యజమాన్యం కలిసి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా చెల్లింపులో జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు.
కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆకుల హరిణ్, లక్ష్మయ్య, రవీందర్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. సిఐటీయూ ఆధ్వర్యంలో ఆర్జీ 1 ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.