నల్లగొండ జిల్లా : నల్లగొండ మున్సిపాలిటీ ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. సరైనా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ విధులను నిలిపివేసి నిరసన తెలిపారు.
రోజు పని చేసినా థంబ్ ఇంప్రెషన్ లో అటెండెన్స్ పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన జీతాల్లో కోతలు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.