తునికాకు బోనస్​ తక్షణమే ఇవ్వాలి.. ఎఫ్డీవో ఆఫీసు ఎదుట కార్మికుల ధర్నా

భద్రాచలం, వెలుగు:  పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్‌ను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాచలం ఎఫ్‌డీవో ఆఫీసు ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  పార్టీ నియోజకవర్గ  కో కన్వీనర్​కారం పుల్లయ్య మాట్లాడుతూ.. 2016 నుంచి 2021 వరకు తునికాకు సేకరించిన కార్మికులకు బోనస్​ డబ్బులు తమ అకౌంట్లలో జమ కాలేదని ఆందోళన చెందుతున్నారన్నారు. 

అధికారులు చేసిన తప్పుల వల్ల కార్మికులు నష్టపోతున్నారన్నారు. సాంకేతిక తప్పులను తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు.  సూపరింటెండెంట్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు.