దుండిగల్,వెలుగు: తాగిన మత్తులో కార్మికుడు సూసైడ్ చేసుకుండు. గండిమైసమ్మ పరిధిలోని 60 గజాల కాలనీలో దశరథ్ ( 30), అనుసుజ దంపతులు ఉంటున్నారు. కార్మికుడిగా పనిచేస్తున్న దశరథ్ తాగుడుకు బానిసగా మారి పనికి కూడా వెళ్లకుండా పేకాట ఆడుతూ భార్యతో గొడవపడుతుండేవాడు. గురువారం సాయంత్రం భర్త దశరథ్ కు చెప్పి భార్య జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మత్తులో ఉన్న దశరథ్ ఇంట్లో చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. భార్య కంప్లయింట్‌తో దుండిగల్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
బిల్డింగ్‌పై నుంచి దూకి..
జీడిమెట్ల : బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ ప్లంబర్ సూసైడ్ చేసుకుండు. బీదర్‌కి చెందిన సుభాష్ (35), భార్య, ఇద్దరు పిల్లలతో సిటీకి వచ్చి చింతల్ పరిధి వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నాడు. కుత్బుల్లాపూర్‌లోని మోడీ బిల్డర్స్‌లో ప్లంబర్‌గా చేస్తున్నాడు. తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. తాగొద్దని భార్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. తను పనిచేసే మోడీ బిల్డర్స్వద్దకు వెళ్లి బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కంప్లయింట్‌తో జీడిమెట్ల సీఐ బాలరాజు కేసు ఫైల్ చేశారు.
For More News..