
జగిత్యాల రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పని చేయడం సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన ప్రతిసారీ నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి కారణంగానే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదని చెప్పారు. ప్రముఖ విద్యావేత్త అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టభద్రులు అండగా నిలిచి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేసిందని
తెలిపారు.