
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణను గెలిపిస్తే ప్రజల కోసమే పనిచేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళరామకృష్ణాపూర్ లో రామకృష్ణాపూర్ బీజేపీ టౌన్ బీసీ మోర్చా అధ్యక్షుడు విరామల్ల పాల రాజయ్య, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ బంగారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ శివ, రైతులు, రెల్లి కులస్తులు ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రస్ లో చేరారు.
భీమారం మండలలంలో మాజీ జడ్పీటీసీ జరుపుల రాజ్ కుమార్ నాయక్, మాజీ సర్పంచులు, 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సింగాపురం, దాంపూర్ భీమారం, పోలంపల్లి, ఎల్లికేశ్వరం మాజీ సర్పంచులు దుర్గం మల్లేశ్, సంతోషం భాస్కర్ రెడ్డి, గద్దె రామిరెడ్డి, దర్శనాల రమేశ్, కొడిపే సమ్మయ్య , భీమారం మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పత్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డితోపాటు వార్డ్ మెంబర్లు, సింగిల్ విండో చైర్మన్లు,11 గ్రామాలకు చెందిన మరో 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు కాకా కుటుంబం సేవ చేస్తుందన్నారు.
ఇక్కడి ప్రజల ఆకాంక్ష, సేవ చేస్తాడనే నమ్మకంతో వంశీకృష్ణకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. వంశీ గెలుపుకోసం కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీజేపీ, బీఅరెస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. సీనియర్ నాయకులతో కలిసిమెలిసి పనిచేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే వివేక్ సూచించారు. కార్యక్రమంలో భీమారం మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.