
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని లేదంటే రాబోయే రోజుల్లో తమకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్సెక్రెటరీ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్శశికాంత్ డిమాండ్చేశారు.
మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి చార్మినార్లో మెదక్ జిల్లాను కలపాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్, ప్రశాంత్, నాయకులు సాయి, సుధీర్ పాల్గొన్నారు.