కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనుల్లో స్పీడప్ పెంచి, గడువులోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. ఆదివారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనుల పురోగతిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని డివిజన్ల వ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆ సమాచారాన్ని ఐసీసీసీకి అనుసంధానించడం వల్ల నిర్వహణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ సంజయ్ కుమార్, ఐటీ మేనేజర్ రమేశ్, టెక్నీషియన్ పవన్ తదితరులు ఉన్నారు.
వెహికల్స్‌పై నిఘా పెట్టాండి : గ్రేటర్ వరంగల్‌లో అనుమానాస్పద వెహికల్స్‌పై నిఘా పెంచాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం వరంగల్ తూర్పు పరిధిలోని ఎంజీఎం కూడలి ఆన్ లిమిటెడ్ వద్ద ఉన్న ఎస్ఎస్టి చెక్ పోస్ట్‌ను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను పక్కగా పాటించాలని, ప్రతి వాహనాన్ని పరిశీలించాలని చెప్పారు. డబ్బు, మద్యం ఇతర వస్తువుల తరలింపు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.