- 2,452 పనులకు కేవలం 750 పనులు మొదలు
- ఇందులో 365 వర్క్స్ మాత్రమే పూర్తి
- పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వని సర్కారు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద చేపట్టిన పనులు ఏడియాడనే ఆగిపోయాయి. రెండేళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. కొన్ని శంకుస్థాపనలకే పరిమితమైతే.. మరికొన్ని మధ్యలో ఉన్నాయి. ఇంకొన్ని పనులు పూర్తైనా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. -2,452 పనుల్లో 750 మొదలు కాగా -365 మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జీపీకి 25 లక్షలు.. మున్సిపాలిటీకి రూ.50 లక్షలు
యాదాద్రి జిల్లాలోని 421 పంచాయతీలు, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2021 జూన్ 22 సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో నిర్వహించిన సభలో స్పెషల్డెవలప్మెంట్ఫండ్కింద ఒక్కో పంచాయతీకి రూ. 25 లక్షలు, కొత్త మున్సిపాలిటీలకు రూ. 50 లక్షల చొప్పున, మేజర్ మున్సిపాలిటీ భువనగిరికి రూ.కోటి మంజూరు చేశారు. ఈ మేరకు 2021 జూలై 8న రూ. 108.75 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 392 విడుదల చేసింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో 2,452 పనులు చేపట్టాలని గుర్తించా
కొన్ని పనులు పూర్తయినా బిల్లుల్లేవ్
ఎమ్మెల్యేలు రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో సర్పంచులు, పార్టీ లీడర్లకు కేటాయించారు. ఎలాంటి టెండర్ ప్రాసెస్ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 750కి పైగా పనులు చేపట్టారు. ఇందులో ప్రస్తుతం 365 పనులు పూర్తిగా, మిగతావి సగానికంటే ఎక్కువగా పూర్తయ్యాయి. పనులు పూర్తి చేసిన వాళ్లు బిల్లులకు సంబంధించిన చెక్కులను ఈ కుబేర్‌లో ఎంట్రీ చేయించారు. సెక్రటేరియట్‌కు వెళ్లిన చెక్కులు అక్కడే ఆగిపోయాయి. ఫైనాన్షియల్ఇయర్ ముగిసినా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు కొత్తగా చేపట్టాల్సిన పనులను ఆపేశారు. కాగా, కొందరు సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్‌కు వెళ్లి బిల్లులు క్లియరెన్స్చేయించుకున్నట్టు తెలిసింది. చెక్కులను ఈ కుబేర్‌లో గత నెలలో ఎంట్రీ చేయించిన ఓ కాంట్రాక్టర్‌కు 15 రోజుల్లోనే రూ. 30 లక్షలు రిలీజ్ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడులో శంకుస్థాపనలకే పరిమితం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా మునుగోడు నియోజకవర్గానికి ఎస్‌డీఎఫ్ పనులు ఊసే ఎత్తలేదు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన మండల మీటింగుల్లో సర్పంచ్‌లు పలుమార్లు ఆందోళన చేశారు. ఉప ఎన్నికలు ముగిసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచిన తర్వాత జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఎస్‌డీఎఫ్ కింద పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ప్రారంభం కాకపోవడంతో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి.
సీడీఎఫ్ పనులదీ అదే పరిస్థితి..
నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) కింద పనులు చేపట్టిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా రావడం లేదు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీడీఎఫ్ కింద రూ.3 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టవచ్చు. దీంతో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ తమతమ నియోజకవర్గాల్లో 116 వర్క్స్ కేటాయించారు. అయితే ఇందులో కేవలం 20 పనులే పూర్తయ్యాయి. కాగా, బిల్లులు రాకపోవడంతో ప్రారంభించిన పనులను కూడా ఆపేశారు.