నాలా పనులను పూర్తి చేస్తం : రోనాల్డ్ రోస్

నాలా పనులను పూర్తి చేస్తం :   రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: చాంద్రాయణగుట్టలో అంసపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి చాంద్రాయణగుట్టలోని నాలా, రోడ్డు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. సిటీలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ లో ఉన్న నాలా అభివృద్ధి పనులను తొందరగా పూర్తిచేస్తామన్నారు. కమిషనర్ వెంట బల్దియా చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ వెంకన్న, అధికారులు ఉన్నారు.