దూలపల్లిలో అటవీ, వన్యప్రాణుల రక్షణ చట్టంపై వర్క్ షాప్

దూలపల్లిలో అటవీ, వన్యప్రాణుల రక్షణ చట్టంపై వర్క్ షాప్

హైదరాబాద్, వెలుగు: దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో మంగళవారం పీసీసీఎఫ్ డోబ్రియల్ అధ్యక్షతన అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, పరివేష్ 2.0 పోర్టల్ పై ఒక రోజు వర్క్​షాప్​ నిర్వహించారు.   ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, టీ– ఫైబర్, టెలికామ్ సంస్థల ప్రతినిధులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఇతర శాఖల ఆఫీసర్లకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. అటవీ అనుమతుల కోసం ఆన్​ లైన్​లో దరఖాస్తు​  చేసుకునేటప్పుడు సరైన అవగాహన లేకపోవడంతో  వివిధ శాఖలు చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని అటవీశాఖ అధికారులు వివరించారు.