బాసర, వెలుగు: ప్రకృతి వనరుల నిర్వహణపై బాసర ట్రిపుల్ఐటీలో శనివారం వర్క్షాప్నిర్వహించారు. సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐఐటి మద్రాస్ అధ్యాపకుడు డాక్టర్ పిచ్చుక సుబ్బారావు ‘మారుతున్న వాతావరణంలో నీటి వనరుల నిర్వహణ’ అంశంపై నాలుగో సంవత్సరం విద్యార్థులకు వర్క్షాప్చేపట్టారు. వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం, జల వనరుల నిర్వహణలో సవాళ్లు, నీటి లభ్యతలో అనిశ్చితిపై చర్చించారు.
నీటి వనరులకు పెరిగిన డిమాండ్, మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యవస్థల పనితీరును వివరించారు. నీటి సంరక్షణ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు రణధీర్, ఖలీల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.