గండిపేట, వెలుగు: హిమాయత్‌సాగర్‌లోని పోలీస్ అకాడమీలో గురువారం కొత్త క్రిమినల్ చట్టాలపై వన్డే వర్క్‌షాప్ నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, డాక్టర్ జితేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త క్రిమినల్ లాస్‌పై డెవలప్ చేసిన యాప్‌ను ప్రారంభించారు.
అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అడిషనల్ డీజీపీ శిఖాగోయెల్, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. నల్సా, సీడీటీఐ అధ్యాపకులు వర్క్‌షాప్ మోడరేటర్లుగా, గ్రూప్ డిస్కషన్ల ఫెసిలిటేటర్లుగా హాజరయ్యారు. వర్క్‌షాప్‌లో దాదాపు 90 మంది తెలంగాణ పోలీస్ఉన్నతాధికారులు పాల్గొన్నారు.