
ఉలాన్‌బాటర్ (మంగోలియా) : ఇండియా వెటరన్ క్యూయిస్ట్ కమల్ చావ్లా ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన ఫైనల్లో కమల్ 6–2తో పాకిస్తాన్‌కు చెందిన అస్జద్ ఇక్బాల్‌పై ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2017 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన 45 ఏండ్ల కమల్ ఫైనల్లో తొలుత తడబడ్డాడు.
23–47, 18–47తో తొలి రెండు సెట్లు కోల్పోయాడు. కానీ, అద్భుతంగా పుంజుకున్న ఇండియా స్టార్ వరుసగా ఆరు సెట్లలో గెలిచి ట్రోఫీ నెగ్గాడు. ఈ టోర్నీలో ఇండియాకు మరో మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. మెన్స్ కేటగిరీలో మల్కీత్ సింద్, విమెన్స్‌లో విద్య పిళ్లై , కీర్తన పనిదియన్ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో తిరిగొచ్చారు.