కోనరావుపేట,వెలుగు: మండలంలోని నిమ్మపెల్లిలో లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేశ్ నాయక్ .. కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో గిరిజనుల బతుకులు మారలేదన్నారు. 1980 అటవీ హక్కుల చట్టాన్ని సవరించి, గిరిజన పోడు రైతులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు మోహన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, ప్రకాష్ నాయక్,వెంకటేష్ నాయక్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్భవన్లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ హాజరయ్యారు. హక్కుల గురించి అడిగిన ఆదివాసీలపై ప్రభుత్వాలు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుసంగా సత్యనారాయణ, ఆత్రం కళ్యాణ్ కుమార్, ఆత్రం ఉపేందర్ కుమార్, కురుసంగా పురుషోత్తం విజయకుమార్, అనిల్ కుమార్, అభిషేక్,ఆత్రం విజయలక్ష్మి, గుర్రాల జ్యోతి, ఆత్రం అనుపమ తదితరులు పాల్గొన్నారు