ఇండియా నిర్ణయాలు భేష్

ఇండియా నిర్ణయాలు భేష్

ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్​ అజయ్​ బంగా


న్యూఢిల్లీ: ప్రపంచమార్కెట్లు మాంద్యంలో ఉన్నప్పుడు పుంజుకోవడానికి ఇండియా చాలా చర్యలు తీసుకుందని ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్​అజయ్​ బంగా ప్రశంసించారు. కరోనా సమయంలో  సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రదర్శించిన చురుకుదనాన్ని ఇక నుంచి కొనసాగించాలని సూచించారు. జీడీపీ గ్రోత్​ బాగుందన్నారు.   మనదేశంలో అధిక జీతాల ఉద్యోగాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘‘ టెక్నాలజీ రంగంలో జీతాలు ఎక్కువగా వస్తాయి కానీ జాబ్స్​ సంఖ్య తక్కువే. ఇంటర్నేషనల్​ కంపెనీలు పాటిస్తున్న  చైనా ప్లస్ వ్యూహాన్ని ఇండియా సొమ్ము చేసుకోవాలి. ఈ అవకాశం ఐదేళ్ల కంటే ఎక్కువ ఉండదు”అని అన్నారు. బంగా గత నెల ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్​గా బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జీఎంఆర్​ వరలక్ష్మీ సెంటర్ ఫర్​ ఎంపవర్​మెంట్ అండ్​ లైవ్లీహుడ్స్​కు వెళ్లి అక్కడి స్టూడెంట్లతో మాట్లాడారు.