పావర్టీ ప్రాస్పరిటీ ప్లానెట్​ రిపోర్ట్​

పావర్టీ ప్రాస్పరిటీ ప్లానెట్​ రిపోర్ట్​

పావర్టీ, ప్రాస్పరిటీ అండ్​ ప్లానెట్ పాథ్వేస్ ఔట్​ ఆఫ్​ ది పాలిక్రైసిస్​ పేరుతో ప్రపంచ బ్యాంక్​ నివేదకను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని 2024 నాటికి 142 కోట్ల మంది జనాభాలో 12.9 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారని వెల్లడించింది.  

పేదల సంపాదన రోజుకు 2.15 డాలర్ల(సుమారు రూ.181) కంటే తక్కువగా ఉన్నట్టు తేల్చింది. సాధారణంగా మధ్య ఆదాయ దేశాల ప్రజల సంపాదన రోజుకు 6.85 డాలర్లు (సుమారు రూ.576)గా ఉంటుంది. ప్రజల ఆదాయాన్ని రోజుకు 6.85 డాలర్ల కంటే ఎక్కువకు పెంచడానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేసింది. 

జనాభా పరంగా చూస్తే 1990లో కంటే 2024లోనే అత్యధిక మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. పేదరికానికి జనాభా పెరుగుదలే ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. ప్రస్తుత భారతదేశ పురోగతిని చూస్తే అత్యంత పేదరికాన్ని నిర్మూలించేందుకు దశాబ్దాల సమయం పడుతుందని తెలిపింది. 

2030లో భారతదేశంలో అత్యంత పేదరికం రేటు సున్నాకు చేరుతుందని అంచనా వేసింది. 2030లో ప్రపంచ పేదరికం రేటు 7.31 శాతం నుంచి 6.72 శాతానికి మాత్రమే పడిపోతుందని, ఇది ఇప్పటికీ 3 శాతం లక్ష్యం కంటే చాలా ఎక్కువని ప్రపంచ బ్యాంక్​ వెల్లడించింది.  ప్రపంచ జనాభాలో 8.5 శాతం మంది నిరుపేదలేనని సంస్థ రిపోర్టు వివరించింది.