ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే మూడేళ్లలో 6.7 శాతం స్థిరమై వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తా జా నివేదిక లో వెల్లడించింది. దేశీయ డిమాండ్, పెట్టుబడులు పెరగడం, సేవల రంగంలో చురుకైన కార్యకలాపాలు ఇందుకు కారణమని తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 6.6శాతంగా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో అంచనా వేసింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవనిధి సంస్థ( IMF) భారత ఆర్థిక వ్యవస్థ వృద్దిరేటుపై అంచనా వేసింది. 2024-25లో వృద్ధిరేటును 6.5శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది.