ఎలక్ట్రామా ప్రారంభం

ఎలక్ట్రామా ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు:  ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌‌‌‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఎలక్ట్రామా ఢిల్లీలో శనివారం ప్రారంభమైంది. ఇది ఈ నెల 26 వరకు గ్రేటర్​ నోయిడాలోని ఇండియా ఎక్స్‌‌‌‌పో సెంటర్​లో జరుగుతుంది. దీనిని ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్​ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. కేంద్ర విద్యుత్, హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్ ఎలక్ట్రికల్​ షోను ప్రారంభించారు. ఎనర్జీ స్టోరేజ్​, ఎలక్ట్రిక్​ మొబిలిటీ, ఆటోమేషన్​, ఏఐ ఆధారిత పవర్​ సిస్టమ్స్​వంటి వాటిని ఇక్కడ  ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బీ2బీ మీటింగ్స్​, లీడర్‌‌షిప్ ​సెషన్స్ ​జరుగుతాయి. మొదటిరోజు వెయ్యికిపైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.