World Cancer Day 2025: క్యాన్సర్ ని జయించిన సినీ సెలెబ్రెటీలు వీళ్ళే..

World Cancer Day 2025: క్యాన్సర్ ని జయించిన సినీ సెలెబ్రెటీలు వీళ్ళే..

World Cancer Day 2025: అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ క్యాన్సర్ భారిన పడిన వారి గణాంకాలు పరిశీలిస్తే దాదాపుగా దాదాపుగా 2 కోట్ల మందికి పైగా ప్రజలు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే క్యాన్సర్ ప్రతీ ఏటా మహమ్మారి చాప క్రింద నీరులా విస్తరిస్తోంది. దీంతో చాలామంది వైదులు క్యాన్సర్ కి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గమని చెబుతుంటారు. ఒకవేళ చికిత్సలు ఉన్నపటికీ ఖర్చుతో కూడుకున్నవి, అలాగే సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే (World Cancer Day 2025) సందర్భంగా క్యాన్సర్ భారిన పడి విజయం సాధించిన అలాగే ఇప్పటికీ ఈ మహమ్మారితో పోరాడుతున్న సినీ సెలెబ్రెటీల గురించి తెలుసుకుందాం.

మమతా మోహన్‌దాస్: తెలుగు, మళయాళం, తమిళ్ తదితర భాషల్లో హీరోయిన్ గా నటించి  ఒకప్పటి హీరోయిన్ మమతా మోహన్‌దాస్ మెప్పించింది. అంతేకాదు పాటలు పాడి కూడా టాలెంట్ నిరూపించుకుంది.  2009లో హాడ్జికిన్స్ లింఫోమాతో బాధపడుతున్న ప్రముఖ మమతా మోహన్‌దాస్ ప్రకటించింది. దీంతో దాదాపుగా 10 ఏళ్ళ పాటూ సినీ పరిశ్రమకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని జయించింది. ప్రస్తుతం మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.

హంసా నందిని: మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ కి స్టెప్పులేసి అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హంసా నందిని టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితమే. అయితే నటి హంసా నందినికి 2021లో 3వ గ్రేడ్ ఇన్వేసివ్ కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం క్యాన్సర్ ని జయించేందుకు ధైర్యంగా పోరాడుతోంది. ఈ క్రమంలో కీమో, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ పలు పోస్టులు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

సోనాలి బింద్రే: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు తదితర స్టార్ హీరోలతో కలసి నటించింది వెటరన్ హీరోయిన్ సోనాలి బింద్రే.  2018లోనటి సోనాలి బింద్రే తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కొంతకాలంపాటు హై-గ్రేడ్ క్యాన్సర్‌కు న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.  కీమోథెరపీ తీసుకోవడంతో సోనాలి బింద్రే  జుట్టును కత్తిరించుకుని పలుమార్లు  ఫోటోలు కూడా షేర్ చేసింది. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల అండతో క్యాన్సర్ సులభంగా జయించింది. ప్రస్తుతం సోనాలి బింద్రే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తోంది.

హీనా ఖాన్: బాలీవుడ్ ప్రముఖ నటి "హీనా ఖాన్" క్యాన్సర్ భారిన పడినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం తనకి బ్రెస్ట్ క్యాన్సర్  3వ స్టేజిలో ఉందని దీంతో తాను ముంబై లో ఉన్నటువంటి ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ లో కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మనీషా కోయిరాలా: 90స్ లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో ఒకరు  మనీషా కొయిరాలా. ఆమె 2012లో 4వస్టేజ్  అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఆ తర్వాత కీమో, రేడియేషన్ థెరపీ చికిత్సలతో క్యాన్సర్ ని జయించింది. గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి అనే వెబ్ సీరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.

సంజయ్ దత్: 2020 లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ముంబైలోని ఓ ప్రయివేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో సమగ్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే క్యాన్సర్ ఆరంభ స్టేజిలోనే గుర్తించడంతో సులభంగా సంజయ్ దత్ క్యాన్సర్ ని జయించాడు. ప్రస్తుతం మళ్ళీ మునపటిలానే సినిమా షూటింగులకు హాజరవుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది తెలుగులో ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించాడు.

రాకేష్ రోషన్: బాలీవుడ్ లో తీసిన క్రిష్ సినిమా దాదాపుగా అందరికీ గుర్తుంటుంది. ఈ సినిమా దర్శకుడు రాకేష్ రోషన్ గొంతు క్యాన్సర్ తో భాద పడ్డాడు. కానీ ఈ ప్రమాదకర క్యాన్సర్ ని ఇనీషియల్ స్టేజ్ లోనే గుర్తించడంతో ఖరీదైన క్యాన్సర్ చికిత్సలు తీసుకుని క్యాన్సర్ ని జయించాడు. అయితే రాకేష్ రోషన్ కూతురు సునైనా రోషన్ కొన్ని సంవత్సరాల క్రితం గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ ప్రాణాలతో బయటపడింది.

యువరాజ్ సింగ్: 6 బంతులకు 6 సిక్సర్లు మోది ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు భారత ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్. అతనికి మెడియాస్టినల్ సెమినోమా అనే అరుదైన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఊపిరితిత్తుల మధ్య ఛాతీలోని కణజాలాలను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత యువరాజ్ బోస్టన్ మరియు ఇండియానాపోలిస్‌లలో కీమోథెరపీ చేయించుకుని క్యాన్సర్ ని జయించాడు.

గౌతమి: ఒకప్పుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ కృష్ణ మరింతమంది సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది వెటరన్ హీరోయిన్ గౌతమి. ఆమెకు 35 సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్పటినుంచి క్యాన్సర్ తో పోరాడుతునే ఉంది. ప్రస్తుతం  'లైఫ్ ఎగైన్ ఫౌండేషన్' ద్వారా క్యాన్సర్ తో పోరాడుతున్న వారిని అండగా నిలుస్తోంది. అలాగే సినిమా షూటింగులలో కూడా పాల్గొంటోంది.