"క్యాన్సర్ వచ్చి సచ్చిపోయిండంట" అని ఎవరి గురించైన చెప్పినప్పుడు, క్యాన్సరా? పెద్దోళ్ల రోగమేలే' అని తీసిపారేయొద్దు. క్యాన్సరు కు ఆ లెక్కలేం లేవు. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ఎవ్వరికైనా రావొచ్చు.మన దేశంలోనే రోజుకి పదమూడొందల మంది క్యాన్సర్ బారినపడి చనిపోతున్నారు.అలాంటి క్యాన్సర్ వస్తే ఎట్లా ఎదుర్కోవాలి?
క్యాన్సర్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలో నమోదవుతున్నాయి. ఇంత జరుగుతన్న అసలు క్యాన్సర్ గురించి సరిగ్గా తెలిసినవాళ్లు, ఇలాంటి రోగం ఒకటి వస్తుందని ముందే జాగ్రత్తపడుతున్నవాళ్లు తక్కువే ఉన్నారు. అవగాహన తక్కువ అందుకే ప్రతీ ఏటా 'యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్' ఫిబ్రవరి 4న 'వరల్డ్ క్యాన్సర్దే'గా జరుపుతుంది. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ డే లక్ష్యం.
నెంబర్ 2 క్యాన్సరే!
అనారోగ్యంతో చనిపోతున్నవాళ్లు దేశంలో వేలమంది ఉన్నారు. ఇందులో గుండెపోటుతో చనిపోతున్న వాళ్లు ఎక్కువ మంది ఉంటే, ఆ తర్వాత ఎక్కువమంది చనిపోతోంది క్యాన్సర్ వల్లే! మన దగ్గరే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న జబ్బు ఇది. ఆడవాళ్లలో, మగవాళ్లలో సమానంగా ఉంది. క్యాన్సర్. ఈ మధ్య పిల్లలో కూడా కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ చెప్పినట్లే. క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం.
ఏయే క్యాన్సర్లు ఎక్కువ?
మనదేశంలో ఎక్కువ నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ బాధపడుతున్నవాళ్లు ఎక్కువ. ఆడవాళ్లు ట్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువుగా గురువుతున్నారు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో అధికంగా నోటి, గొంతు క్యాన్సర్ కనిపిస్తోంది. తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సరు గురవుతున్నారు. వీటి తర్వాత ఊపిరితిత్తులు, ఉదర సంబంధించిన క్యాన్సర్లతో ప్రజలు బాధపడుతున్నారు. చిన్నారుల్లో లుకేమియా బ్లడ్ క్యాన్సర్) ఎక్కువగా ఉంటోంది. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడేవాళ్లు కొద్దిమందే ఉంటున్నారు.
కనిపెట్టడం ఎలా?
సాధారణంగా క్యాన్సరు నాలుగు స్టేజీలుగా విభజిస్తారు. మగవాళ్లలో క్యాన్సర్ నిర్ధారణ చేసే స్క్రీనింగ్ పరీక్షలు తక్కువగా ఉన్నాయి. స్క్వామస్ సెల్ కార్సినోమా (చర్మంపై వచ్చే పొలుసు క్యాన్సర్ వచ్చిన వాళ్లకి చర్మంపై చిన్న చిన్న పుండ్లు వస్తాయి. ఆ పుండ్లు స్రవించే రక్తాన్ని పరీక్షించి క్యాన్సర్ను నిర్ధారిస్తారు. ఆడవాళ్లలో అయితే కొన్ని పరీక్షల వల్ల క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. 'పాప్స్మియర్', 'మామోగ్రఫీ' టెస్టుల వల్ల క్యాన్సర్ ఫ్రీ మాలిగ్నెంట్ స్టేజ్ అంటే '0' స్టేజ్ లో ఉందో లేదో తెలుస్తుంది.
ALSO READ | మెదడు ఆరోగ్యానికి ‘బ్రెయిన్ ఫిట్‌నెస్’
'0' స్టేజ్లో ఉంటే జాగ్రత్తలు తీసుకుని నివారించవచ్చు. 'పాప్ స్మియర్' టెస్ట్ 35 సంవత్సరాలు దాటిన మహిళలుచేయించుకుంటే, సర్వైకల్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడం ఈజీ అవుతుందంటారు నిపుణులు. ఈ టెస్ట్ ప్రతి స్త్రీ తన జీవిత కాలంలో కనీసం మూడుసార్లైనా చేయించుకోవాలి. అప్పుడే డాక్టరు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించి ట్రీట్ మెంట్ మొదలుపెడతారు.అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి స్త్రీ ప్రతి రెండేళ్లకు ఒక సారి 'మామోగ్రఫీ' చేయించుకుంటే 'బ్రెస్ట్ క్యాన్సర్' వచ్చే సూచనలు ఉన్నాయో, లేదో తెలుస్తుంది.
ట్రీట్మెంట్ ఉంది
క్యాన్సర్ అనగానే దానికి ఒక ట్రీట్ మెంట్ ఉంటుందని తెలియకుండా, కచ్చితంగా చనిపోతారనే భ్రమ ఉంది. ఈ భ్రమను వదిలిపెట్టి క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏదైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్ను కలిస్తే తేలిపోతుంది. నిజంగానే క్యాన్సర్ వచ్చినా మొదటి స్టేజీలోనే గుర్తిస్తే చిన్న ట్రీట్ మెంట్ తో బయటపడొచ్చు. క్యాన్సర్ ఉందని తెలిసినంత మాత్రాన ఈ జీవితం అయిపోయింది' అని డిప్రెషన్లోకి వెళ్లడంలో అర్థం లేదు.
క్యాన్సరు, దాని తీరునుబట్టి ట్రీట్ మెంట్ ఉంది. మనకు తెలిసిన చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారినపడి ట్రీట్ మెంట్ తీసుకొని, తిరిగి కోలుకున్నవాళ్లు ఉన్నారు. యువరాజ్ సింగ్ గుర్తున్నాడు కదా? క్రికెట్ లో స్టార్ బ్యాట్స్ మేన్ అయిన యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి, తిరిగి కోలుకొని మళ్లీ క్రికెట్ ఆడాడు కూడా! క్యాన్సర్ ను జయించాలన్న ధైర్యం తెచ్చుకోవడమే దాన్ని పోరాడటానికి కావాల్సిన శక్తి, "వరల్డ్ క్యాన్సర్ ఉద్దేశం కూడా ఇదే!.