పంజాగుట్ట నిమ్స్​లో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

పంజాగుట్ట నిమ్స్​లో క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

పంజాగుట్ట, వెలుగు: వరల్డ్​క్యాన్సర్​డే సందర్భంగా మంగళవారం ‘యునైటెడ్ బై యూనిక్’ థీమ్​తో పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో క్యాన్సర్​అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమర్జెన్సీ బ్లాక్ నుంచి పంజాగుట్ట మెయిన్ గేట్ వరకు కొనసాగింది. వైద్యులు, మెడికల్​స్టూడెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, డాక్టర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతివీర్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.

 అవగాహన, ధైర్యం, మెరుగైన చికిత్సతో క్యాన్సర్​ను జయించవచ్చని బీరప్ప చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో క్యాన్సర్ కు ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆంకాలజీ డిపార్ట్​మెంట్ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ సదాశివుడు గుండేటి రాసిన క్యాన్సర్ రిజిస్ట్రీ పుస్తకాన్ని విడుదల చేశారు. డాక్టర్లు రచన, రాజశేఖర్, మౌనిక, రోషిణి, లక్ష్మీ భాస్కర్, మీడియా ఇంచార్జ్ సత్యగౌడ్, ఎంహెచ్ఎం ఇన్‌చార్జ్ మార్తా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.