సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరులో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ విజయాల ఖాతా తెరిచాడు. మూడో రౌండ్లో గెలిచి డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో సమంగా నిలిచాడు. బుధవారం జరిగిన ఈ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో లిరెన్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లోనూ తెల్లపావులతో బరిలోకి ఓడిన తర్వాత గత పోరులో పాయింట్ పంచుకున్న గుకేశ్ ఈసారి అద్భుతంగా ఆడాడు.
13 ఎత్తుల తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన ఇండియా జీఎం మిడిల్గేమ్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. గుకేశ్ ఎత్తులను సరిగ్గా ప్రతిఘటించలేకపోయిన లిరెన్ చివరకు సమయం కోల్పోయి గేమ్ చేజార్చుకున్నాడు. మూడో రౌండ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు చెరో 1.5 పాయింట్లతో సమంగా నిలిచారు. గురువారం ఆటకు సెలవు కాగా.. శుక్రవారం నాలుగో రౌండ్ జరుగుతుంది.